హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సుల కొరత.. ప్రజలకు అవస్థలు

KDP: ఒంటిమిట్టలో ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా రాకపోకలకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు అదనపు బస్సులు నడిపాలని స్థానికులు కోరుతున్నారు.