హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి నిర్మూలనకు అవగాహన ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గంజాయి, మత్తు పదార్థాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రింగ్‌ సెంటర్‌ వద్ద యువతకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వపై సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.