హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం'

కోనసీమ: రైతుల సంక్షేమానికి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. అంతర్జిల్లా రైతుల వ్యవసాయ విజ్ఞాన యాత్రలో భాగంగా మండపేట నియోజకవర్గం నుండి వ్యవసాయ పరిశోధనా స్థానానికి బయలుదేరిన 2 ప్రత్యేక బస్సులను ఇవాళ ఆయన జెండా ఊపి ప్రారంభించారు.