హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ షాప్, మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి

MNCL: తాండూర్ మండల ప్రజావాణిలో సోమవారం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శంకర్, నవీన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. సుభద్ర కాలనీలో రేషన్ షాప్ లేక ప్రజలు తాండూర్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలనీలోనే రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో మీ సేవ కేంద్రం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.