హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు నేతలకు వైసీపీలో కీలక పదవులు

కృష్ణా: వైసీపీ రాష్ట్ర బూత్ కమిటీల విభాగం ఉపాధ్యక్షుడిగా పెడన నియోజకవర్గానికి చెందిన సంగా మధుసూదనరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కారుమంచి కామేశ్వరరావు నియమితులయ్యారు. నూతన బాధ్యతలు చేపట్టిన వారిని మాజీ మంత్రి పేర్ని నాని అభినందించారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.