హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాం కళాశాలలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి MBA, MCA కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. MCAలో 10, MBAలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి. TG ICET-2026లో అర్హత సాధించి, ఎక్కడా అడ్మిషన్ పొందని అభ్యర్థులు హాజరుకావచ్చు. అడ్మిషన్లు ఈనెల 31న ఉదయం 10 గంటలకు కళాశాలలో జరుగుతాయని అధికారులు తెలిపారు.