అయోధ్య రామ మందిరానికి ఓ భక్తురాలు ఇచ్చిన రూ.4 కోట్ల చెక్ బౌన్స్ అవ్వటం చర్చనీయాంశమైంది. తమిళనాడుకు చెందిన ఆమె ఇటీవల దర్శనానికి వచ్చి ఆలయ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ చెక్ అందజేశారు. ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. ఆ ఖాతాలో కేవలం రూ.3 ఉండటంతో షాకయ్యారు. దీనిపై వివరణ కోరుతూ భక్తురాలికి నోటీసులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
అయోధ్య మందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. ఖాతాలో రూ.3


