హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు నందిగామలో ప్రత్యేక ఆధార్ కేంద్రం'

NTR: నందిగామ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వద్ద ఇవాళ ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు ఈ విషయాన్ని తెలిపారు. ఈ కేంద్రంలో ఆధార్‌లోని పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఉచితంగా సవరించుకోవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.