అల్లూరి: డుంబ్రిగూడ ప్రధాన రహదారులపై మూగజీవులు సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ రహదారిపై అకస్మాత్తుగా పశువులు అడ్డుగా రావడంతో ప్రమాదాల భయం నెలకొంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారులపై మూగజీవులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై పశువులు.. వాహనదారులకు ఇబ్బందులు


