హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు

PLD: నరసరావుపేట పార్టీ జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పల్నాడు జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.