E.G: కొవ్వూరు రైల్వే గేట్ సమీపంలో సోమవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సింహాచలం నుంచి కొండపల్లికి బొగ్గు తరలిస్తున్న రైలు వెనుక నుంచి రెండో భోగీ పట్టా తప్పింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను సరి చేస్తున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అటుగా వెళ్ళే రత్నాచల్ రెండు గంటలుగా నిడదవోలులో ఆగిపోయింది.
ఆంధ్రప్రదేశ్
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్లు ఆలస్యం


