హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నం కాలువలో మృతదేహం లభ్యం

NLR: ముత్తుకూరులోని బీసీ కాలనీ సాయిబాబా గుడి సమీపంలో కృష్ణపట్నం కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆకుపచ్చ రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ముత్తుకూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.