CTR: జిల్లాలో గౌడన్నలకు ప్రభుత్వం కల్పిస్తున్న 10 శాతం వైన్‌షాపుల రిజర్వేషన్ ప్రయోజనం దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే స్తోమత లేక అసలైన గౌడన్నలు టెండర్లలో పాల్గొనే పరిస్థితి లేదని చెబుతున్నారు. గౌడ అభ్యర్థుల పేర్లతో బినామీలు టెండర్లలో పాల్గొని షాపులు దక్కించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
'గౌడన్నలకు పెట్టుబడి సాయం దక్కడం లేదు'


