ELR: సెప్టెంబర్ 2వ తేదీన పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ... జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరై యువజన విభాగాన్ని లాంఛనంగా ఆవిష్కరించనున్నారని చెప్పారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి యువత, జనసైనికులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పిఠాపురంలో జనసేన యువజన విభాగం కార్యక్రమం'


