హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల హత్య

అమెరికాలో కాలిఫోర్నియాలో కేరళకు చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. అదే అపార్ట్‌మెంటులో ఉంటున్న స్నేహితురాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతులు త్రిస్సూర్ సమీపంలోని ముడిక్కోడ్‌కు చెందిన అంజన, తిరువనంతపురం కేశవదాసపురానికి చెందిన యాన్ మేరీ మాథ్యూగా గుర్తించారు. ఇప్పటికే నిందితురాలు అనిల అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.