హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధ్యతగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్!

BPT: ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని చందోలు ఎస్సై మాధవరావు తెలిపారు. గ్రామంలో 'శిరోరక్ష - ప్రాణ రక్ష' కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే ప్రాణనష్టం అరికట్టవచ్చన్నారు. నిబంధనలు పాటించకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వాహనదారులకు జరిమాన విధించారు.