హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం!

అల్లూరి: విశాఖలోని అనందపురం నుంచి పెందుర్తి వైపు వెళుతున్న కారు సోమవారం ఉదయం ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఒడిశా నుంచి వస్తున్న కారు సత్తార్వు జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టి అనంతరం పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయిపోయింది. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.