హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకుంటున్న పర్యావరణహిత కళ్యాణ మండపం

కోనసీమ: పచ్చని కోనసీమ ప్రకృతి సౌందర్యం, కొబ్బరి సిరులతో అప్పనపల్లిలో ఏర్పాటు చేసిన పర్యావరణహిత కళ్యాణ మండపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మామిడుకుదురు మండలం అప్పనపల్లిలో ఓ వివాహ వేడుకలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా మండపాన్ని తీర్చిదిద్దారు. కోనసీమ సంస్కృతికి ప్రతీకలైన పచ్చని కొబ్బరి గెలలు, అరటి పిలకలను మేళవించి సర్వాంగ సుందరంగా అలంకరించారు.