హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో నేడు మంత్రి లోకేశ్ పర్యటన

విశాఖ: మంత్రి లోకేశ్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. మధురవాడ పనోరమ హిల్స్-ఎండాడ మార్గంలో రూ.2 వేల కోట్లతో నిర్మించనున్న ఏఐజీ 1000 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పోర్టు గెస్ట్ హౌస్ సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ సీఎం దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. గంభీరం వద్ద నూతన కళాశాల, ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనాలను ప్రారంభిస్తారు.