హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల గుర్తింపు

SS: నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద బైక్ చెట్టును ఢీకొట్టి దగ్ధమైన ఘటనలో మృతి చెందిన ముగ్గురు యువకులకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులు పుట్టపర్తికి చెందిన ఓం దీక్షిత్ (20), కొత్తచెరువుకు చెందిన అనిల్ (24), అర్జున్ (21)గా తేలింది. పుట్టపర్తి నుంచి ఒకే బైక్‌పై నల్లమాడ వెళ్తుండగా తీవ్ర వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.