హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నల్లమాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా కాలి బూడిదైంది. పుట్టపర్తి నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.