శ్రీకాకుళం: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నౌపడ ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభచాటారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గౌరి స్వరూప్, హరిని, జశ్వంత్, దిలీప్, శంకర్రెడ్డి, సాయి శ్యామ్, వసుంధర, ధరణి తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. వీరి ప్రతిభతో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని, బాలుర జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించి సత్తా చాటాయి.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర కబడ్డీ పోటీల్లో నౌపడ విద్యార్థుల ప్రతిభ


