హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అకస్మాత్తుగా కాలిన మీటర్ బాక్స్

NRPT: కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ పక్కనున్న మీటర్ బాక్స్ అకస్మాత్తుగా కాలిపోయింది. ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపివేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కాలిపోయిన మీటర్ బాక్స్, వైర్లకు మరమ్మతులు చేసి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.