GDWL: కేటీదొడ్డి మండలం కొండాపూర్‌కు చెందిన పోతుల సుప్రియ (19) అదృశ్యమైంది. 28న రాఖీ కట్టేందుకు వెంకంపేటకు వెళ్లిన ఆమె, 29న సాయంత్రం 4 గంటలకు తల్లికి ఫోన్ చేసి స్టేజ్ వద్ద ఉన్నట్లు తెలిపింది. ఇంటికి వస్తున్నానని చెప్పినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రాఖీ కట్టేందుకు వెళ్లి తిరిగిరాని యువతి


