BPT: కర్లపాలెం మండల కేంద్రంలోని ఒక అతిథి గృహంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.40,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం


