హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్!

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర ఉన్నవారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలో కార్యక్రమం చేపట్టారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.