KKD: కడియం మండలం ఎర్ర కాలనీకి చెందిన టైలర్ మానేం సత్యనారాయణ కుటుంబంతో కలిసి నిన్న ఉదయం వేడుకకు వెళ్లారు. గమనించిన దుండగులు 11.30 గంటల సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.3.5 లక్షల నగదు, సుమారు 10 కాసుల బంగారం, వెండి వస్తువులు అపహరించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన సత్యనారాయణ చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
తాళం వేసిన ఇంట్లో చోరీ..!


