అన్నమయ్య: కోళ్లబైలు బైరెడ్డి కాలనీలో భార్య దండామణిని కొడవలితో నరికి హత్య చేసి పరారైన మధుకర్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హత్య అనంతరం బావమరిది వీరభద్రారెడ్డికి ఫోన్ చేసి మరో ఇద్దరిని చంపుతానంటూ బెదిరించినట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా వాల్మీకిపురం వరకు వెళ్లిన నిందితుడు అక్కడ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
హత్య కేసులో నిందితుడి కోసం ముమ్మర గాలింపు


