ELR: ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామివారి క్షేత్ర విమాన గోపుర స్వర్ణమయ పథకానికి తిరువూరుకు చెందిన నాళ్ల వేంకట సత్యనారాయణరావు రూ.1,00,116 విరాళం అందజేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు తిరువూరు శాఖ చెక్కు ద్వారా ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు సమర్పించారు. స్వామివారి విమాన గోపుర స్వర్ణమయ పథకానికి భక్తులు విరాళాలు అందించాలని ఆలయ వర్గాలు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విమాన గోపుర స్వర్ణమయ పథకానికి భక్తుల విరాళం


