హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతదేహాలతో తల్లిదండ్రుల ఆందోళన

కడప శివారులోని సింగ్‌పూర్ టౌన్‌షిప్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి, జస్వంత్ కుమార్ రెడ్డి మృతి చెందారు. తమ కుమారుల మృతిపై ట్రాఫిక్ పోలీసులు భిన్నంగా మాట్లాడుతున్నారని, ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదని మృతుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం SP కార్యాలయం వద్ద మృతదేహాలతో ఆందోళన చేపట్టారు.