హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చవితికి సిద్ధమవుతున్న గణనాథులు

KKD: తొండంగి, రౌతులపూడి, శంఖవరం తదితర మైదాన ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకల కోసం గణనాథుల ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ పరిమాణాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే విగ్రహాల తయారీ పూర్తికాగా, వాటికి రంగులు వేయాల్సి ఉంది.