హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. పట్టణ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ సాయి నిధి ఎంటర్ ప్రైజెస్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని పలు కాలనీలలో పర్యటిస్తూ మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.