NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ విగ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభిషేకం, హోమం, ఇతర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దగదర్తి శివాలయంలో సంకటహర చతుర్థి పూజలు


