హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే పోలింగ్ కేంద్రాల తుది జాబితా

CTR: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితాను చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం కలెక్టరేట్‌లో విడుదల చేయనున్నారు. గతంలో 1,511 కేంద్రాలు ఉండగా, అదనంగా 197 కేంద్రాలకు అనుమతి రావడంతో మొత్తం 1,708 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేశారు.