హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హంద్రీనీవా కాలువలో దంపతుల గల్లంతు!

KRNL: చిప్పగిరి మండలం బెల్డోనకు చెందిన చిదానంద(55), రామలింగమ్మ (50) హంద్రీనీవా కాలువలో దూకిన ఘటన గుంతకల్లు మండలం కసాపురం వద్ద ఆదివారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు గాలింపు చేపట్టగా రామలింగమ్మ మృతదేహం లభ్యమైంది. చిదానంద కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.