హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల దరఖాస్తులకు రేపే ఆఖరి గడువు

BDK: మణుగూరు మండలంలో కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణకు సోమవారం ఆఖరి గడువు అని ఎంపీడీవో శ్రీకాంత్ తెలిపారు. గతంలో దరఖాస్తు చేయని వారు, ధ్రువపత్రాలు జతచేయని వారు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదివారం సూచించారు. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదన్నారు.