హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదిగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎర్రవెల్లి కృష్ణ

BHNG: తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొండగడపకు చెందిన ఎర్రవెల్లి కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన డాక్టర్ పిడమర్తి రవికి, రాష్ట్ర నాయకులకు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.