హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని ప్రమాదకర బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో వాహనదారులకు రహదారి స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. అలాగే రహదారి పక్కన పెరిగిన పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ఎస్సై రమేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.