ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 31న విముక్త జాతుల దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకకు సమస్త సంచార జాతుల ప్రజలు, బి.సి. ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈ నెల 31న విముక్త జాతుల దినోత్సవం: కలెక్టర్


