హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'

అన్నమయ్య: దళితుల స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ,మహిళలను కులం పేరుతో దూషిస్తూ వేధిస్తున్న మధుసూదన్‌,అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి ఆదివారం తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.