హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్

W.G: పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కాళ్ల ఎస్సై గణశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కాళ్ల మండలం ఏలూరుపాడు శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ.3,020 నగదు స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.