హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారుపాకలో రామాలయ నిర్మాణం నిలిపివేయాలి'

KKD: పారుపాక గ్రామంలో ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న రామాలయ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలుగు మహిళా జాగృతి అధ్యక్షురాలు దేవర అనూష యాదవ్ డిమాండ్ చేశారు. గ్రామంలో ఇప్పటికే రామాలయం ఉండగా మరో ఆలయం నిర్మించడం వల్ల విభేదాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. స్థల వివాదం హైకోర్టు పరిధిలో ఉన్నందున నిర్మాణం కొనసాగించడం సరికాదన్నారు.