హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం: మాజీ ఎమ్మెల్యే

MNCL: క్రీడలతో యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల 52వ డివిజన్ నాయకులు జక్కం జగన్ తండ్రి దాసు జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.