హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జగాల్‌రెడ్డి ఎన్నిక

NLG: కనగల్ ప్రెస్ క్లబ్ (TUWJU) అధ్యక్షుడిగా సీనియర్ విలేకరి సుంకిరెడ్డి జగాల్‌రెడ్డి ఐదోసారి ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని జగాల్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.