HNK: శాయంపేట(M) పెద్దకోడెపాక శివారులోని 632, 633 సర్వే నంబర్ల భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భూములు ప్రభుత్వలవా, ప్రైవేటు వ్యక్తులవా అనే అంశంపై స్థానికుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిగా సూచిస్తూ బోర్డు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం అది కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల హక్కులు, రక్షణపై అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు.
తెలంగాణ
పెద్దకోడెపాకలో భూముల వ్యవహారంపై చర్చ


