హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గమ్మ దయ భక్తులపై ఉండాలి: ఎమ్మెల్యే

MDCL: జీడిమెట్ల డివిజన్‌ వినాయక్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన దేవాలయంలో దుర్గా భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన, బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ దయ భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు.