హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: యావపూర్ గ్రామంలో బోనాల ఉత్సవాలు

MDK: తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ యాంజాల స్వామి ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు చేపట్టి పోచమ్మ తల్లికి సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.