MHBD: గంగారం మండలం మడగూడెంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని బాల కుమారస్వామి ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు 3 తులాల బరువున్న స్వామివారి బంగారు విగ్రహాలను అపహరించినట్లు ఆలయ పూజారి చుంచ చంద్రయ్య తెలిపారు. పూజారి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు గూడూరు సీఐ వినయ్ చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఆలయంలో చొరబడి బంగారు విగ్రహాలు చోరి


