హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ ఆక్రమణ యత్నం.. ఇద్దరు బైండోవర్

JGL: ప్రభుత్వ అటవీ భూమిని ఆక్రమించేందుకు యత్నించిన దమ్మయ్యపేటకు చెందిన తునికి నర్సయ్య, దేవేపల్లి గణేష్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని శనివారం కొడిమ్యాల తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు. భవిష్యత్‌లో అక్రమాలకు పాల్పడబోమని హామీ తీసుకుని ఇద్దరినీ బైండోవర్ చేశారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.