ASR: కొయ్యూరు మండలం నడింపాలెం జంక్షన్‌లో ఆదివారం సీఐ బీ.శ్రీనివాసరావు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముమ్మరంగా వాహన తనిఖీలు


